50. దేహేంద్రియ నిరూపణము

ద్విచత్వారింశద్వర్ణకము
50. దేహేంద్రియ నిరూపణము

            దేహేంద్రియంబులకును ఆత్మకును వైలక్షణ్యంబు నిరూపించు చున్నారము. దేహేంద్రియములు అనిత్యంబును, అశుద్ధంబును, జడరూపంబును, దుఃఖరూపంబును, దృశ్యంబులును, నవికారంబులును, పరిచ్ఛిన్నంబులును, సాపేక్షప్రకాశ్యంబులును, సంకల్పంబులును, ఆధేయంబులును, సావయవంబులును, అప్రకాశ్యంబులును, ఆద్యంత సహితంబులును, సజాతీయ విజాతీయ స్వగత భేదసహితంబులును, కార్యంబులును, గుణవంతంబులును అనియును, ఆత్మనిత్యుఁడు, శుద్ధుఁడు, అజడుఁడు, సుఖస్వరూపుఁడు, ద్రష్ట, నిర్వికారుఁడు, అపరిచ్ఛిన్నుఁడు, స్వప్రకాశఁడు, నిష్కలుఁడు, ఆధారుఁడు, నిరయవుఁడు, అప్రకాశ్యుఁడు, ఆద్యంతరహితుఁడు, సజాతీయ విజాతీయ స్వగతభేద రహితుఁడు, కారణుఁడు, నిర్గుణుఁడు అనియును, ఈ ప్రకారముగా దేహేంద్రి యాదులకును, ఆత్మకును వైలక్షణ్యము విచారించి ఆత్మ నేనని యెవఁడెఱుఁగుచున్నాఁడో, వాఁడే ముక్తుఁడని వేదాంత శాస్త్ర సిద్ధాంతము.


ఇది ద్విచత్వారింశద్వర్ణకము.